భారీ నగదుతో యాదాద్రిలో మంత్రి మల్లారెడ్డి

94

దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం మూడు కిలోల బంగారాన్ని.. నగదు రూపంలో రూ. 1 కోటి 83 లక్షలను ఆలయ అధికారులకు అందజేశారు. మూడు కిలోల విలువ చేసే బంగారానికి నగదుతో మేడ్చల్ నియోజకవర్గం కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. అలాగే, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ. 7 లక్షలను కార్పొరేటర్లు మంత్రితో కలిసి అందజేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..