- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాంతించు తల్లీ.. గంగమ్మకు పూజలు !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వస్తున్న నేపథ్యంలో గంగమ్మ తల్లికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం పూజలు చేశారు. 1908లో వరదల సమయంలో నిజాం రాజులు పూజలు చేయగా.. మళ్లీ అలాంటి వరదలే ఇప్పుడు రావడంతో పండితుల సూచనతో గంగమ్మకు పూజలు నిర్వహించారు. మూసీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వందేళ్ల తర్వాత ఇంతటి విపత్తు వచ్చిందని మేయర్ బొంతు రామ్మోహన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వస్తున్న నేపథ్యంలో గంగమ్మ తల్లికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం పూజలు చేశారు. 1908లో వరదల సమయంలో నిజాం రాజులు పూజలు చేయగా.. మళ్లీ అలాంటి వరదలే ఇప్పుడు రావడంతో పండితుల సూచనతో గంగమ్మకు పూజలు నిర్వహించారు. మూసీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వందేళ్ల తర్వాత ఇంతటి విపత్తు వచ్చిందని మేయర్ బొంతు రామ్మోహన్ వ్యాఖ్యానించారు. అందుకే గంగమ్మ శాంతించాలని పూజలు చేశామని, ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Next Story






