శభాష్ ముషార్రఫ్.. థాంక్స్ కేటీఆర్ సర్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-17 11:17:47  IST  )

<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. నిర్మల్ జిల్లాలో ప్రతి గ్రామంలో నిర్మిస్తున్న శెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం విషయంలో నిర్మల్ కలెక్టర్‌ను అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సోమవారం అభినందించారు. గ్రామ పంచాయతీలలో పేరుకుపోతున్న తడి, పొడి చెత్త నిర్వహణ విషయంలో ఈ నిర్మాణాలు ఎంతగానో ఉపకరిస్తాయని నిర్మల్ జిల్లాను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కేటీఆర్ ఆ మెసేజ్‌లో సూచించారు. జిల్లా [&hellip;]</p>

శభాష్ ముషార్రఫ్.. థాంక్స్ కేటీఆర్ సర్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. నిర్మల్ జిల్లాలో ప్రతి గ్రామంలో నిర్మిస్తున్న శెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం విషయంలో నిర్మల్ కలెక్టర్‌ను అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సోమవారం అభినందించారు. గ్రామ పంచాయతీలలో పేరుకుపోతున్న తడి, పొడి చెత్త నిర్వహణ విషయంలో ఈ నిర్మాణాలు ఎంతగానో ఉపకరిస్తాయని నిర్మల్ జిల్లాను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కేటీఆర్ ఆ మెసేజ్‌లో సూచించారు. జిల్లా కలెక్టర్ కేటీఆర్‌కు థాంక్స్ చెప్పారు.

https://twitter.com/KTRTRS/status/1295340357685665792?s=20

Next Story