ఎంబీబీఎస్ విద్యార్థికి మంత్రి కేటీఆర్ భరోసా.. చదువుకు ఆర్థిక సాయం

by  |
ఎంబీబీఎస్ విద్యార్థికి మంత్రి కేటీఆర్ భరోసా.. చదువుకు ఆర్థిక సాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ లోని బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారత్ కు తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపథ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.

అనూష వైద్య విద్య కోర్సు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి కేటీఆర్‌ దృష్టికి వచ్చింది. పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్‌గా వైద్య విద్యపై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూషకి కేటీఆర్ అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానని బుధవారం మంత్రి ప్రకటించారు. ప్రగతి భవన్ లో చెక్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అనూష ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని, కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్‌గా తిరిగి రావాలని ఆకాంక్షించారు.. అనూషకి ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి, ఆమెకు అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.



Next Story

Most Viewed