BREAKING: జూన్ 4 తరువాత ఓట్ జిహాద్ వాళ్లు పారిపోతరు: ప్రధాని మోడీ సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 1 |
BREAKING: జూన్ 4 తరువాత ఓట్ జిహాద్ వాళ్లు పారిపోతరు: ప్రధాని మోడీ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఓట్ వాళ్లు పారిపోతారని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తును ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వద్దని తెలంగాణ ప్రజలకు నిర్ణయించుకున్నారని తెలిపారు. బీజేపీని గెలిపించేందుకు 140 కోట్ల మంది ప్రజలు సంకల్పం తీసుకున్నారని స్పష్టం చేశారు. జూన్ 4 తరువాత దేశంలో ఉన్న ఓట్ జిహాద్ వాళ్లు పారిపోతారంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన సెటైర్లు వేశారు. అదేవిధంగా జూన్ 4 తరువాత భారత విరోధులు, పౌర స్మృతి విరోధులు, ఆర్టికల్ 370 విరోధులు పారిపోతారంటూ కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు.

మధ్య తరగతి ప్రజల కలను తమ పార్టీ కచ్చితంగా నెరవేరుస్తుందని తెలిపారు. గత పదేళ్లలో ఎన్నో సమస్యలకు ఎన్డీఏ సర్కార్ పరిష్కారం చూపిందని అన్నారు. డిజిటల్ రంగంలోనూ భారత్ ఓ సూపర్ పవర్‌గా ఎదిగిందని గుర్తు చేశారు. దేశాన్ని లూఠీ చేయడమే కాంగ్రెస్ ట్రాక్ రిక్డార్డ్ అని, వారసత్వ రాజకీయాలు చేయడం వారికే చెల్లిందన్నారు. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న నాడు పలు నగరాల్లో ఎన్నో చోట్ల బాంబు పెలుళ్లు జరిగి చాలామంది అమాయకులు ప్రాణాలు విడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా గుడి వద్ద బాంబు పేలిందని గుర్తు చేశారు. వారి పాలనలో పార్క్, గుడికి వెళ్లాలన్నా, ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. నేడు బీజేపీ పాలనలో అలాంటి పరిస్థితులు లేవని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed