ఎన్నికల వేళ సంచలనం.. MPTCలపై మంత్రి కొప్పుల అసభ్యకర కామెంట్స్ (ఆడియో)

by  |
ఎన్నికల వేళ సంచలనం.. MPTCలపై మంత్రి కొప్పుల అసభ్యకర కామెంట్స్ (ఆడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఆడియో కలకలం సృష్టిస్తోంది. సాక్షాత్తు ఓ మంత్రి ఆడియోనే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ వాయిసేనంటూ ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్‌లపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఓ ఎంపీటీసీ మెంబర్ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రహస్య సమావేశం ఏర్పాటు చేసిన విషయం గురించి మంత్రి కొప్పుల మాట్లాడినట్టుగా టాక్ నడుస్తోంది. అయితే ఈ ఆడియో కావాలని లీక్ చేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆడియో లీక్ చేస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించే లీకులు ఇచ్చారా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది. మంత్రి కొప్పుల.. ఎంపీటీసీలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఆడియోలో బీజేపీ, కాంగ్రెస్‌ను ఉద్దేశించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

నీకేం పోయేకాలం రా బాబూ.. గాల్లో అన్ని కిలోమీటర్లు వచ్చావా ?

Next Story

Most Viewed