- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మీ పని మీరు చేసుకోండి.. పవన్ కల్యాణ్‌పై మంత్రి సెటైర్లు

దిశ, ఏపీ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని అంటూ విమర్శించారు. పవన్ కల్యాణ్ సలహాలు ఇవ్వడం మాని చేయాల్సింది చేస్తే మంచిదంటూ హితవు పలికారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపాల్సింది కేంద్రం.. మేం ఏం చేయాలో మేము చేస్తాం.. ఆయనది అసలు ఏ పార్టీనో కూడా తెలియడం లేదు. జగన్‌కు ఉచిత సలహాలు ఇవ్వడానికి ఆయనను మేమైనా సలహాదారుడిగా పెట్టుకున్నామా…? మాకు సలహాలు ఇవ్వటం మాని, ఆయన చేయాల్సింది చేయాలి. బీజేపీతో సంబంధాలు దెబ్బతినకుండా, మోడీ, అమిత్ షా , రాష్ట్ర బీజేపీ నాయకులు ఏమీ అనుకోకుండా.. నీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా పోరాటం చేసుకో పవన్ కల్యాణ్. సలహాలు ఇవ్వాలనుకుంటే.. తన దత్త తండ్రి బాబుకు పవన్ కల్యాణ్ సలహాలు ఇచ్చుకోమనండి. మాకు పనికి మాలిన సలహాలు వద్దు అంటూ మంత్రి కొడాలి నాని ఘాటుగా హెచ్చరించారు.