- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు: కొడాలి నాని
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోవడం అందుకు నిదర్శనమన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ ఇంకా జాతీయ పార్టీగా చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రజల నేత సీఎం జగన్ను ఢీ కొడతాననడం అవివేకమన్నారు. చంద్రబాబు టీడీపీని గాలి పార్టీగా తయారు చేసి ఆయన గాలి నాయకుడిగా మిగిలిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోవడం అందుకు నిదర్శనమన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ ఇంకా జాతీయ పార్టీగా చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రజల నేత సీఎం జగన్ను ఢీ కొడతాననడం అవివేకమన్నారు. చంద్రబాబు టీడీపీని గాలి పార్టీగా తయారు చేసి ఆయన గాలి నాయకుడిగా మిగిలిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా టీడీపీని చంద్రబాబు పతనం చేసినట్లు మంత్రి చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని వ్యాఖ్యానించారు.
Next Story






