చంద్రబాబుకు ప్రపంచరత్న ఇవ్వాలి: కొడాలి నాని

by  |
చంద్రబాబుకు ప్రపంచరత్న ఇవ్వాలి: కొడాలి నాని
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్ధంతి, జయంతి నాడే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని, ఎన్టీఆర్‌కు భారతరత్న తెచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదని కొడాలి నాని అన్నారు. నీచమైన పనుల్లో చంద్రబాబుకు ప్రపంచరత్న ఇవ్వాలని, అసలు ఎన్టీఆర్‌కు చంద్రబాబుకు పోలిక ఉందా అని ప్రశ్నించారు. టీడీపీని సర్వనాశనం చేసే శక్తి చంద్రబాబు, లోకేష్‌కే ఉందని, ఎన్టీఆర్‌ను ఇష్టపడే వారు చంద్రబాబును రాష్ట్ర సరిహద్దులు దాటించాలని అన్నారు.

పదవులు, ఓట్ల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారి పోతారని, ఎన్టీఆర్ పార్టీని, సీఎం హోదాను చంద్రబాబు తస్కరించారని, ఎన్టీఆర్ మరణానికి కారకులెవరో ప్రజలకు తెలుసన్నారు. అఖిలప్రియ అరెస్ట్‌పై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి ప్రశ్నించారు. దేవాలయాల ధ్వంసంపై చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.


Next Story

Most Viewed