- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శశికళను పార్టీలోకి చేర్చుకోం..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, త్వరలో ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి డి.జయకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో శశికళకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. శశికళపై పార్టీ విధించిన నిషేధం కొనసాగుతుందన్నారు.ఆమె జైలు నుంచి ఎప్పుడు విడుదలైనా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, త్వరలో ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి డి.జయకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో శశికళకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. శశికళపై పార్టీ విధించిన నిషేధం కొనసాగుతుందన్నారు.ఆమె జైలు నుంచి ఎప్పుడు విడుదలైనా తమకు అనవసరమని, ఆమె ఎప్పుడు బయటకు వచ్చినా పార్టీలో మాత్రం చోటు లేదని కుండబద్దలు కొట్టారు. శశికళకు చెందిన కుటుంబం మినహా.. పార్టీలో ఎవరైనా చేరొచ్చని మంత్రి జయకుమార్ తెలిపారు.
Next Story






