- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట మార్పిడితో లాభాలు
by Shyam |
<p>దిశ, నల్లగొండ: పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లిలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం రైతులు వరి పంటపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని.. మిర్చి, కందులు, పెసర వంటి పంటలనూ సాగు చేయాలన్నారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తండ్రి అంకిరెడ్డి పేరు మీద రైతు వేదిక నిర్మించడం హర్షణీయమన్నారు. ఎలాంటి పంటలు […]</p>

X
దిశ, నల్లగొండ: పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లిలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం రైతులు వరి పంటపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని.. మిర్చి, కందులు, పెసర వంటి పంటలనూ సాగు చేయాలన్నారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తండ్రి అంకిరెడ్డి పేరు మీద రైతు వేదిక నిర్మించడం హర్షణీయమన్నారు. ఎలాంటి పంటలు పండించాలి? ఏ పంటలు వేస్తే లాభాదాయకంగా ఉంటుంది తదితర సలహాలు తెలుసుకునేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, ఆర్డీఓ కిషోర్, హుజూర్ నగర్ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మఠంపల్లి జడ్పీటీసీ జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






