దేశం చూపు తెలంగాణ వైపు: మంత్రి అల్లోల

by Chintha Aamani |

<p>దిశ, ఆదిలాబాద్: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ ప‌ట్ట‌ణంలోని తన నివాసం వద్ద మంత్రి పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన ఘనుడు సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ [&hellip;]</p>

దేశం చూపు తెలంగాణ వైపు: మంత్రి అల్లోల
X

దిశ, ఆదిలాబాద్: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ ప‌ట్ట‌ణంలోని తన నివాసం వద్ద మంత్రి పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన ఘనుడు సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఈస్థితిలో ఉండటానికి కేసీఆర్ నాయకత్వమే కారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణ సుభిక్షంగా మారుతోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి వలస కార్మికులకు అన్నదానం చేశారు. కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి స‌త్య‌రాయ‌ణ గౌడ్, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, రాంకిష‌న్ రెడ్డి తదితరులు మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద‌ అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళుల‌ర్పించారు.

Tags: minister allola indrakarn reddy, trs party formation celebration, cm kcr, nirmal

Next Story