- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్యూట్ పోలీసన్న.. సాంగ్ అద్భుతం: హరీశ్ రావు
<p>దిశ, మెదక్: కరోనా నియంత్రణకు రాత్రింబగళ్లు పోలీసులు చేస్తున్న కృషిని, వారి త్యాగాన్ని తెలిపే విధంగా సిద్దిపేటకు చెందిన సవ్వడి మ్యూజిక్ వారు రూపొందించిన ‘సెల్యూట్ పోలీసన్న’ పాట అద్భుతంగా ఉందని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. దీని వీడియో సాంగ్‌ను సిద్దిపేటలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ అమలుకు పోలీసుల పాత్ర కీలకంగా నిలిచిందనీ, వారు చూపుతున్న పోరాట పటిమను, చేస్తున్న త్యాగాన్ని కళ్లకు […]</p>

దిశ, మెదక్: కరోనా నియంత్రణకు రాత్రింబగళ్లు పోలీసులు చేస్తున్న కృషిని, వారి త్యాగాన్ని తెలిపే విధంగా సిద్దిపేటకు చెందిన సవ్వడి మ్యూజిక్ వారు రూపొందించిన ‘సెల్యూట్ పోలీసన్న’ పాట అద్భుతంగా ఉందని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. దీని వీడియో సాంగ్‌ను సిద్దిపేటలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ అమలుకు పోలీసుల పాత్ర కీలకంగా నిలిచిందనీ, వారు చూపుతున్న పోరాట పటిమను, చేస్తున్న త్యాగాన్ని కళ్లకు కట్టినట్టు పాటలో చూపించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన సవ్వడి మ్యూజిక్ రచయిత వి.వి.కన్న, గాయకుడు స్వామి, సంగీత దర్శకులు నవీన్, కెమెరామెన్ శ్రీకాంత్, డైరెక్టర్, ఎడిటర్ వెంకట్, గ్రాఫిక్స్ రాజు, నిర్వాహకులు తండా భిక్షపతి, కార్తీక్‌లను అభినందించారు.
Tags: Minister Harish Rao, Salute Polisanna Song, mla ramalinga reddy, medak






