- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. మంత్రి హరీశ్ రావుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్‌లో కొత్తగా నిర్మించిన ఆర్క్యన్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్‌తో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవం అనంతరం హరీశ్, ప్రజాప్రతినిధులు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాక ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి ఓపెనింగ్ జరిగిన కొద్దిసేపటికే లిఫ్టు వైర్ తెగిపోయి లిఫ్టు ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో పలువురు గాయపడ్డారు. అయితే ప్రమాదం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్‌లో కొత్తగా నిర్మించిన ఆర్క్యన్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్‌తో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవం అనంతరం హరీశ్, ప్రజాప్రతినిధులు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాక ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది.
ఆసుపత్రి ఓపెనింగ్ జరిగిన కొద్దిసేపటికే లిఫ్టు వైర్ తెగిపోయి లిఫ్టు ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో పలువురు గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్టులో పరిమితికి మించి జనం అందులో ఉన్నట్టు తెలిసింది. దీంతో వెంటనే స్పందించిన సాంకేతిక సిబ్బంది లిఫ్టును అతి కష్టం మీద తెరిచి అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అయితే మంత్రి హరీశ్ రావు వెళ్లిపోయిన అనంతరం ఈ ప్రమాదం జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story






