బండి సంజయ్ బాధ్యత వహిస్తావా.. బీజేపీకి మంత్రి గంగుల సవాల్

by  |
బండి సంజయ్ బాధ్యత వహిస్తావా.. బీజేపీకి మంత్రి గంగుల సవాల్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. బీజేపీవన్ని శిఖండి రాజకీయాలేని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్‌కు ఈటల రాజేందర్ మద్దతు ఇవ్వడం, అభ్యర్థినే నిలబెట్టడంలేదని బీజేపీ ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే బీజేపీలో చీలికలు వచ్చినట్టుగా స్పష్టం అవుతోందని గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.

1,324 మంది ఓటర్లలో బీజేపీ, కాంగ్రెస్ మాకు బలం లేదని తప్పుకుంటున్నామని ప్రకటించినట్టు తెలిపారు. ఏకగ్రీవం ఎందుకు కావాలని కడుపులో మంటతో టీఆర్ఎస్‌లో చిచ్చు పెట్టాలని నామినేషన్ వేపించారని గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తండ్రిపై ప్రత్యర్థులు దాడి చేస్తే కొడుకులంతా కలిసి ఎదురు దాడి చేసిన విధంగానే టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరూ కేసీఆర్‌కు అండగా నిలిచి ప్రత్యర్థుల దాడులను తిప్పికొట్టబోతున్నట్టు గంగుల కమలాకర్ ప్రకటించారు. దుష్ట శక్తుల ఎత్తులను చిత్తు చేసేందుకు తమ పార్టీ ఓటర్లంతా ఐక్యంగా ఉండి మా బలమేంటో చూపించేందుకే కలిసి వచ్చామన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 986 ఓట్లకు ఒక్కటి తగ్గినా తమ పార్టీలో క్రమశిక్షణ తగ్గినట్టేనని అన్నారు.

అదే సమయంలో బీజేపీ నుండి గెలిచిన స్థానిక సంస్థల ఓట్లు మొత్తం.. వారు మద్దతు ఇచ్చిన వ్యక్తికి పడతాయా అని సవాల్ విసిరారు. కరీంనగర్‌లో ఉన్న బీజేపీ కార్పోరేటర్లు అందరూ.. ఆ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థికి ఓట్లు వేస్తారా అని గంగుల ప్రశ్నించారు. తక్కువ ఓట్లు పడితే బీజేపీ చీఫ్ బండి సంజయ్ బాధ్యత వహిస్తారా.? లేక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తల తెగినా తామంతా టీ‌ఆర్‌ఎస్‌వైపే ఉంటామని, ఈ ఎన్నిక తర్వాత రాజకీయ పరిణామాలు మారుతాయని గంగుల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం సాధించిన హక్కు దార్లం తామేనని, శిఖండిలంతా కూడా కేసీఆర్ ముందు మాడి మసై పోతారంటూ శాపనార్థలు పెట్టారు.


Next Story

Most Viewed