లాక్‌డౌన్‌పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

by  |
Minister Etela Rajender
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌పై మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హుజూరాబాద్‌లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే ఛాన్సే లేదని స్పష్టం చేశారు. వైరస్ విస్తరిస్తు్న్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని అన్నారు. ప్రాణభయతో ప్రజలు ఆస్పత్రికి వస్తే.. అధిక డబ్బులు వసూలు చేయడం సరికాదని ప్రైవేటు ఆస్పత్రులకు సూచించారు. ఈ సమయంలోనే ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు మానవత్వం ప్రదర్శించాలని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయం మార్గం చూసుకోవడం, స్వార్థం కోసం పనిచేయడం పనికిరాదు అని హెచ్చరించారు. తెలంగాణలో రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. వరి కోతల సమయం కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎక్కువమంది రైతులు వస్తారని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తిచెందుతోందని, ప్రతిఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.


Next Story

Most Viewed