ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు వార‌ధిగా ‘దిశ‌’

51

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: ప‌్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య దిశ దిన‌ప‌త్రిక‌ వార‌ధిగా నిలుస్తోంద‌ని పంచాయ‌తీరాజ్‌ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. హ‌న్మ‌కొండ‌లోని క్యాంపు కార్యాల‌యంలో గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిశ దినప‌త్రిక క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిశ ప‌త్రికలో వ‌స్తున్న క‌థ‌నాలు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు, అధికారుల‌కు బాధ్య‌తల‌ను గుర్తు చేస్తున్న‌ట్లుగా ఉన్నాయ‌ని అన్నారు. దిశ ప‌త్రిక మ‌రింత‌గా పాఠ‌కాస‌క్తిక‌ర క‌థ‌నాల‌ను ప్ర‌చురించాల‌ని సూచించారు. క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో దిశ వ‌రంగ‌ల్ బ్యూరో చీఫ్ అరెల్లి కిర‌ణ్‌, వ‌రంగ‌ల్ తూర్పు రిపోర్ట‌ర్ సూర్య‌ప్ర‌కాశ్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..