- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెను ప్రమాదం నుంచి బయటపడ్డ మంత్రి ఎర్రబెల్లి
<p>దిశ, పాలకుర్తి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కొడకండ్ల మండలం వెలిశాల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. తొర్రూరులో పామాయిల్ సాగుపై రైతుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి అనంతరం అక్కడి నుంచి కొడకండ్ల మండల కేంద్రానికి బయల్దేరారు. వెలిశాల గ్రామ సమీపానికి చేరుకోగా మంత్రి కాన్వాయ్‌కు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్లోని కేజీ ఆఫ్ వీల్స్ కిందకు జారీ […]</p>

దిశ, పాలకుర్తి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కొడకండ్ల మండలం వెలిశాల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. తొర్రూరులో పామాయిల్ సాగుపై రైతుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి అనంతరం అక్కడి నుంచి కొడకండ్ల మండల కేంద్రానికి బయల్దేరారు. వెలిశాల గ్రామ సమీపానికి చేరుకోగా మంత్రి కాన్వాయ్‌కు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్లోని కేజీ ఆఫ్ వీల్స్ కిందకు జారీ దూసుకొచ్చాయి. మంత్రి ప్రయాణిస్తున్న బుల్లెట్ ఫ్రూవ్ వాహనంపై పడటంతో ధ్వంసమైంది. అయితే మంత్రికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆకస్మిక ఘటనతో మంత్రి షాక్‌కు గురయ్యారు. అయితే మరో వాహనంలో బయల్దేరి మంత్రి కొడకండ్లకు వెళ్లడం గమనార్హం. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.






