ఐటీలో తెలంగాణ రెండో స్థానం: మంత్రి అజయ్

by  |
ఐటీలో తెలంగాణ రెండో స్థానం: మంత్రి అజయ్
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఉద్యోగ అవకాశాలను విరివిరిగా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఐటీ రంగంలో అనేక సంస్థలను ఆహ్వానిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఐటీ ప్రస్తుతం ఇంటెలిజెంట్ టెక్నాలజీగా మారిపోతోందని అభివర్ణించారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు.

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలనే ఉద్దేశ్యంతోనే ఖమ్మంకు ఐటీ హబ్‌ను తీసుకొచ్చామని అన్నారు. శనివారం మంత్రి అజయ్ కుమార్ పట్టణంలో నిర్మితమవుతున్న ఐటీ హబ్ టవర్స్‌ను సందర్శించారు. ఇప్పటికే పనులు పూర్తి కావొచ్చాయని .. వచ్చే నెలలో కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, మునిసిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ చావా నారాయణ రావు పాల్గొన్నారు.



Next Story

Most Viewed