కంగన, దీపిక రికార్డులను బ్రేక్ చేసిన ‘కృతి సనన్’

by  |
krithi-sanan
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ కృతి సనన్ ఉమన్ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘మిమి’ రికార్డ్ క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న సినిమా ఐఎండీబీలో హైయెస్ట్ రేటెడ్ ఉమన్ సెంట్రిక్ ఇండియన్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇప్పటివరకు క్వీన్ – 8.2, పీకూ – 7.6, ది డర్టీ పిక్చర్ -7.2 రేటింగ్‌ పొందగా.. తాజాగా 8.3 రేటింగ్‌తో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది ‘మిమి’.

ఈ సక్సెస్ లీడింగ్ లేడీ కృతికే దక్కుతుందని ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పవర్ ‌హౌజ్ పర్ఫార్మర్ సక్సెస్‌ఫుల్ కమర్షియల్ స్టార్‌గా ఎదగడాన్ని పొగిడేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కాంప్లిమెంట్స్ అందుకుంటున్న ఈ సినిమా సరోగసి నేపథ్యంలో రాగా.. తల్లి పాత్రలో అదరగొట్టేసింది. కాగా కృతి ప్రస్తుతం ‘ఆదిపురుష్, బచ్చన్ పాండే, భేడియా, గణ్‌పథ్, హమ్ దో హమారే దో’ చిత్రాలతో బిజీగా ఉంది.



Next Story

Most Viewed