- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంవో ప్రకటనపై అసదుద్దీన్ ట్వీట్
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణం కోసం పాత భవనాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెక్రెటెరీయట్‌లోని మసీదు, ఆలయాలు కూడా కూల్చివేశారు. అయితే, దీనిపై విచారం వ్యక్తం చేస్తూ తెలంగాణ సీఎంవో ఆఫీసు ఓ ప్రకటన చేసింది. దీనిపై స్పందించిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. మసీదు కూల్చివేత విషయంపై యునైటెడ్ ముస్లిం ఫోరమ్ త్వరలో సవివరంగా ప్రకటన చేస్తుందన్నారు. త్వరలోనే తాను మసీదు, […]</p>

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణం కోసం పాత భవనాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెక్రెటెరీయట్‌లోని మసీదు, ఆలయాలు కూడా కూల్చివేశారు. అయితే, దీనిపై విచారం వ్యక్తం చేస్తూ తెలంగాణ సీఎంవో ఆఫీసు ఓ ప్రకటన చేసింది. దీనిపై స్పందించిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. మసీదు కూల్చివేత విషయంపై యునైటెడ్ ముస్లిం ఫోరమ్ త్వరలో సవివరంగా ప్రకటన చేస్తుందన్నారు.
త్వరలోనే తాను మసీదు, ఆలయ నిర్వాహకులతో సమావేశం అవుతానని సీఎం కేసీఆర్ చెప్పారని, కొత్త సచివాలయంతో పాటే మసీదు, ఆలయ నిర్మాణాలు కూడా కొత్తవి చేపడతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని అసదుద్దీన్ వివరించారు. తెలంగాణ పూర్తిగా లౌకికవాద రాష్ట్రమని కానీ, మసీదు, మందిరం కూల్చివేత ఊహించని రీతిలో జరిగిపోయిందని సీఎం విచారం వ్యక్తం చేశారన్నారు. ఈ విషయాన్ని రాగద్వేషాలకు అతీతంగా చూడాలంటూ ఆయన అభ్యర్థించారని చెప్పుకొచ్చారు.






