- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నవాళ్లను చేసుకుంటే..చీట్ చేసే చాన్స్ ఉండదు: మిలింద్
<p>దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ యాక్టర్ మిలింద్ సోమన్..వార్తల్లోకి ఎక్కడం కొత్తేమీ కాదు. గోవా బీచ్‌లో న్యూడ్‌గా పరుగెడుతున్న ఫొటోలను పోస్ట్ చేసి ట్రోల్స్ ఎదుర్కున్న మిలింద్.. మ్యాగజైన్స్‌కు నగ్నంగా పోజులిస్తే పర్లేదు. కానీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ట్రోల్ చేస్తారా? అంటూ రివర్స్ క్వశ్చన్ వేశాడు. ఈ ఇష్యూ అయిపోయిందో లేదో లేటెస్ట్‌గా లైఫ్ పార్ట్‌నర్ ఎలా ఉండాలనే దానిపై వివాదాస్పద కామెంట్స్ చేశాడు. లైఫ్ పార్ట్‌నర్ మన కన్నా వయసులో చిన్నది అయితే […]</p>

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ యాక్టర్ మిలింద్ సోమన్..వార్తల్లోకి ఎక్కడం కొత్తేమీ కాదు. గోవా బీచ్‌లో న్యూడ్‌గా పరుగెడుతున్న ఫొటోలను పోస్ట్ చేసి ట్రోల్స్ ఎదుర్కున్న మిలింద్.. మ్యాగజైన్స్‌కు నగ్నంగా పోజులిస్తే పర్లేదు. కానీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ట్రోల్ చేస్తారా? అంటూ రివర్స్ క్వశ్చన్ వేశాడు. ఈ ఇష్యూ అయిపోయిందో లేదో లేటెస్ట్‌గా లైఫ్ పార్ట్‌నర్ ఎలా ఉండాలనే దానిపై వివాదాస్పద కామెంట్స్ చేశాడు.
లైఫ్ పార్ట్‌నర్ మన కన్నా వయసులో చిన్నది అయితే చీటింగ్ చేసే చాన్స్‌లు తక్కువ అని చెప్పాడు. తనకన్నా 26 ఏళ్ల తక్కువ ఏజ్ ఉన్న ఆంకితా కొన్వర్‌ను పెళ్లి చేసుకున్న మిలింద్.. జీవిత భాగస్వామి నుంచి కోరుకునేది కేవలం శృంగారం ఒక్కటి మాత్రమే కాదు అని చెప్పాడు. సాన్నిహిత్యం, వెచ్చదనం అవసరమని అభిప్రాయపడ్డాడు. ఎమోషనల్ సపోర్ట్ లేనప్పుడే విచ్చలవిడిగా తిరుగుతారని చెప్పాడు మిలింద్. ప్రజెంట్ ‘పౌరశ్‌పుర’ అనే పీరియాడికల్ సిరీస్ చేస్తున్న మిలింద్..ఇందులో ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఏక్తాకపూర్ నిర్మిస్తున్న సిరీస్ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే ప్రశంసలు అందుకోగా.. మిలింద్ లుక్ విమర్శకుల మన్ననలు అందుకుంది.






