ఆ సినిమాలో హీరో కన్నా ఇతనికే రెమ్యునరేషన్ ఎక్కువ.. ఎందుకంటే..?

by  |
ఆ సినిమాలో హీరో కన్నా ఇతనికే రెమ్యునరేషన్ ఎక్కువ.. ఎందుకంటే..?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయింది. పూరీ జగన్నాధ్ – విజయ్ దేవరకొండ – కరణ్ జోహార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటించబోతున్నాడనే అనౌన్స్‌మెంట్‌ ఇందుకు కారణం కాగా.. ఈ ప్రకటనతో మూవీపై ఇప్పటి వరకున్న ఎక్స్‌పెక్టేషన్స్ మరో రేంజ్‌‌కు వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిన మైక్ టైసన్ ‘లైగర్‌’లో విలన్‌గా కనిపించేందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉంటాడనే చర్చ నడుస్తోంది. చేసేది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినా సరే.. హీరో కన్నా టైసన్‌కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను యూనిక్‌గా ప్రజెంట్ చేయాలనే లక్ష్యంతో వర్క్ చేస్తున్న టీమ్ ఈ విషయంలో చాలా పాజిటివ్‌గా ఉందని తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ కాగా రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.



Next Story

Most Viewed