గరికపాడులో వలస కూలీల పడిగాపులు

by Shyam |

<p>దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా గరికపాడు చెక్​పోస్ట్​ వద్ద ఏపీ పోలీసులు పలువురు వలస కార్మికులను అడ్డుకున్నారు. ఫలితంగా తమను సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సోమవారం నుంచి కార్మికులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. లాక్​డౌన్​‌ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న 15 మంది కార్మికులు సోమవారం ఓ వాహనం ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలికి బయలుదేరారు. గరికపాడు చెక్​పోస్ట్​ [&hellip;]</p>

గరికపాడులో వలస కూలీల పడిగాపులు
X

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా గరికపాడు చెక్​పోస్ట్​ వద్ద ఏపీ పోలీసులు పలువురు వలస కార్మికులను అడ్డుకున్నారు. ఫలితంగా తమను సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సోమవారం నుంచి కార్మికులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. లాక్​డౌన్​‌ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న 15 మంది కార్మికులు సోమవారం ఓ వాహనం ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలికి బయలుదేరారు. గరికపాడు చెక్​పోస్ట్​ వద్ద ఏపీ పోలీసులు వీరి వాహనాన్ని నిలిపివేశారు. డ్రైవర్​ కూలీలను అక్కడే వదిలేసి వెళ్లాడు. దీంతో నిన్నటి నుంచి కూలీలు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. రూ. 30 వేలు వెచ్చించి వాహనాలను మాట్లాడుకుని ఇంత దూరం వస్తే.. పోలీసులు తమను అనుమతించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్లడానికీ వాహనం లేదని వాపోతున్నారు.

Tags: Migrant workers, Garikapadu check post, police

Next Story