‘భారత్‌ను ఈ పరిస్థితిలో చూస్తుంటే.. హృదయం ముక్కలవుతోంది’

by  |
‘భారత్‌ను ఈ పరిస్థితిలో చూస్తుంటే.. హృదయం ముక్కలవుతోంది’
X

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌తో సతమవతున్న భారత్‌కు సహాయం అందించేందుకు దిగ్గజ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు ముందుకు వచ్చాయి. కరోనాపై చేస్తున్న పోరులో భారత్‌కు సహాయం చేస్తామని గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు, సుందర్ పిచాయ్, సత్యనాదేళ్లలు తెలిపారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఇరువురు సీఈవోలు ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. ‘భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని చూసి నా హృదయం ముక్కలవుతోంది. భారత్‌కు సహాయం చేస్తున్నందుకు యూఎస్ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆక్సిజన్ పరికరాల కొనుగోలులో భారత్‌కు మద్దతు ఇస్తాం. భారత్ తీసుకుంటున్న ఉపశమన చర్యలకు సహాయంగా మైక్రోసాఫ్ట్ తన టెక్నాలజీ, వనరులను ఉపయోగిస్తుంది. ’ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ట్వీట్ చేశారు.

అంతేగాకుండా.. ‘భారత్‌లో కరోనా సంక్షోభం చూస్తే ఆందోళన కలుగుతోంది. కరోనాపై పోరులో భారత్‌కు సహాయంగా గూగుల్ తరఫున రూ. 135 కోట్లు విరాళాన్ని ప్రకటిస్తున్నాను. ఈ మొత్తాన్ని గివ్ ఇండియా, యునిసెఫ్ ఫండ్‌కు ఇస్తున్నాను’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.


Next Story