Mic Tyson : మైక్ టైసన్ విజయ రహస్యం చెప్పిన డ్రైవర్.. ‘సెక్స్’ చేయకపోతే వారిని చంపేస్తాడు..!

by  |
Mic Tyson : మైక్ టైసన్ విజయ రహస్యం చెప్పిన డ్రైవర్.. ‘సెక్స్’ చేయకపోతే వారిని చంపేస్తాడు..!
X

దిశ, వెబ్‌డెస్క్: మైక్ టైసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సింగ్ క్రీడ గురించి తెలిసిన ప్రతీ ఒక్కరికి మైక్ టైసన్ గుర్తొస్తాడు. అతని పంచ్ పవర్ మాములుగా ఉండదు. ఒక్క పంచ్‌కే చుక్కలు కనిపిస్తాయని చెబుతుంటారు బాక్సింగ్ దిగ్గజాలు. రింగ్‌లోకి ఎంటరయ్యాక అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదట.. గేమ్ విషయంలో టైసన్ చాలా సీరియస్‌గా ఉంటాడని తెలిసింది. కొందరు అతన్ని ‘ఐరన్ పంచ్’ అని కూడా పిలుస్తారట.. మైక్ రింగ్‌లో ఉన్నాడంటే వార్ వన్ సైడ్. అతన్ని ఆపకపోతే తన ప్రత్యర్థి చనిపోయేలా పంచ్‌లు ఇస్తాడని తెలిసింది. అతని విజయ రహస్యం గురించి ఆసక్తికర విషయాలను మైక్ డ్రైవర్ రూడీ గొంజాలెజ్ ‘ది సన్’ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

మైక్ టైసన్ తరచుగా హెవీవెయిట్ బాక్సింగ్ మ్యాచ్‌లకు వెళ్లేముందు లాకర్ రూమ్‌లో ప్రీ-ఫైట్ ‘సెక్స్‌’లో పాల్గొనేవాడని తెలిపాడు. ఎందుకంటే, అతను సెక్స్ చేయకుండా రింగ్లో దిగితే తన ప్రత్యర్థిని చంపేసేంత ఆవేశంతో బరిలోకి దిగుతాడని వెల్లడించాడు. అతని ఆవేశాన్ని, తన బలాన్ని తగ్గించుకోవాలంటే తప్పకుండా శృంగారంలో పాల్గొనేవాడని చెప్పాడు. లేకపోతే, మ్యాచ్‌లో అనార్థాలు జరిగేవని వివరించాడు. తాను మైక్ డ్రైవర్‌గా కొనసాగిన టైంలో అతనితో శృంగారంలో పాల్గొనే అమ్మాయిల కోసం వెతికేవాడినని సంచలన నిజాలను బయటపెట్టాడు గొంజాలెజ్. మ్యాచ్ ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందు నేను అమ్మాయిలను బాత్‌రూమ్స్, బట్టలు మార్చుకునే గదుల్లో ఉంచేవాడినని అసలు సీక్రెట్‌ను బయటపెట్టాడు. టైసన్ వారితో కొన్ని నిమిషాల పాటు గడిపాక రింగ్‌లోకి అడుగుపెట్టి మెరుపు వేగంతో ప్రత్యర్థులను చిత్తు చేసేవాడని ‘ది సన్’ పత్రికకు చెప్పుకొచ్చాడు గొంజాలెజ్.


Next Story