పెళ్లి కావడం లేదు.. మాకు సహకరించండి ప్లీజ్.. మహిళా తహసీల్దార్‌కు యువకుల రిక్వెస్ట్

by  |
Bride
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రీవెన్స్ సెల్, ప్రజా దర్భార్, ప్రజావాణి.. పేరు ఏదైనా ఉద్దేశం ఒక్కటే. ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా అధికారులకు చెప్పుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే ఎవరైన తమ భూమి సమస్యో, పింఛన్ రావడం లేదనో, ఇల్లు కావాలనో, ఉద్యోగం కావాలనో అర్జిలు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం యువకులు ప్రభుత్వ యంత్రాగమే మూర్చపోయే సమస్యను విన్నవించుకున్నారు. మీరే దిక్కు.. మా సమస్యలను పరిష్కరించాలని అభ్యర్ధించారు. ఇంతకూ ఆ సమస్య ఏమిటి అంటారా..? అధికారులు పెళ్లి కూతుళ్లను వెతికి పెట్టాలట. కర్ణాటకలో జరిగిన ఈ వింత వినతికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలో స్త్రీ, పురుషుల నిష్పత్తిలో గణనీయంగా మార్పులు వచ్చాయి. అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య భారీగా తగ్గడంతో అక్కడ వధువులు దొరకడం కష్టంగా మారింది. పురుషులకు 45 ఏళ్లు దాటినా పెళ్లి కావడం లేదు. దీంతో భర్తలు వదిలేసిన వారిని, వితంతువులను వివాహం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వ్యవసాయం చేసే వారికి, ఉద్యోగం లేని యువకులను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదు. దీంతో యువకులు పెళ్లి చేసుకోవడానికి సంవత్సరాల తరబడి ఎదురు చూడక తప్పడం లేదు. మ్యారేజ్ కావాలంటే ఉద్యోగం తప్పని సరి అయిపోయింది ఇక్కడ. తుమకూరు జిల్లాలో ఈ సమస్య మరీ ఎక్కువ ఉన్నది.

అమ్మాయిల కోసం వెతికి వెతికి విసుగు చెందిన తుమకూరు జిల్లాలోని యువకులు అధికారులను ఆశ్రయించారు. చిక్కనాయకనహళ్లి తాలుకా లక్కగొండనహళ్లి గ్రామంలో తహసీల్దార్ తేజస్విని నిర్వహించిన జన స్పందన కార్యక్రమంలో తిపటూరు తాలూకా తిమ్మాపుర గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబాలకు చెందిన 15 మంది యువకులు తాము వివాహం చేసుకునేందుకు అమ్మాయిలను వెతికి పెట్టండి అంటూ వినతి పత్రాలను సమర్పించారు. గతంలో జిల్లా అధికారికి కూడా అర్జీలు పెట్టుకున్నామని, కానీ ఇంత వరకు స్పందించలేదని వివరించారు. వధువులు దొరకక పెళ్లై కూతురు పుట్టాక.. భర్త వదిలేసిన 25 ఏళ్ల మహిళను 45 ఏళ్ల వ్యక్తి మొదటి వివాహం చేసుకోవాల్సి వచ్చిందని వాపోయారు. మీరైనా సహకరించి తనకు పెళ్లిలు జరిగేలా వధువులను వెతికి పెట్టాలని తహసీల్దార్ తేజస్వినిని యువ రైతులు వేడుకున్నారు.



Next Story

Most Viewed