పొద్దున్నే ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన ‘అల్లూరి సీతారామరాజు’

by  |
Ram Charan
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్.. ప్రస్తుతం ఈ పేరు వినగానే అందరికీ ఆర్ఆర్ఆర్ సినిమాలోని అల్లూరి సీతారామరాజు గుర్తుకొస్తున్నాడు. ఇటీవల చరణ్ బర్త్ డే రోజున ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం విడుదల చేసిన రామ్ చరణ్ లుక్ అందరిలో ఆసక్తిరేపుతోంది. అయితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫిట్ నెస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు. సినిమా సినిమాకీ తన బాడీలో చేంజెస్ చేస్తూ.. హీరో క్యారక్టర్‌కు న్యాం చేస్తుంటాడు. ప్రస్తుతం చరణ్ RRR కోసం గతంలో ఎన్నడూ చేయనటువంటి స్పెషల్ లుక్‌తో రెడీ అయ్యాడు. ఇక ఉదయాన్నే తన ఫ్యాన్స్‌ను సర్ ప్రైజ్ చేస్తూ స్ట్రాంగ్ మార్నింగ్ అంటూ జిమ్‌లో వర్కౌట్స్ చేసి అలా కూర్చీలో కూర్చున్న పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అంతేగాకుండా.. ఉదయాన్ని ఇంతకన్నా గొప్పగా ఎవరు స్టార్ట్ చేస్తారంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ఆ ఫోటో చూసిన అభిమానులు కామెంట్లు పెడుతూ.. తెగ షేర్ చేస్తున్నారు.



Next Story

Most Viewed