వృద్ధాశ్రమానికి సొంత భవనం నిర్మించిన మెగా హీరో

by  |
Hero Sai Dharamtej
X

దిశ, ఏపీ బ్యూరో: మెగా హీరో సాయిధరమ్‌తేజ్ దాతృత్వానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సొంతభవనం లేని విజయవాడలోని ‘అమ్మ ప్రేమ ఆదరణ’ అనే ఓల్డేజ్ హోంకు శాశ్వత భవనం నిర్మించడంతో హర్షం వ్యక్తమవుతుంది. రెండేళ్ల క్రితం ఈ ఓల్డేజ్ హోం పరిస్థితిని నిర్వాహకులు ట్విట్టర్ ద్వారా సినీ ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లారు. సాయిధరమ్‌తేజ్‌తో పాటు మరికొందరు సినీ తారలను ట్యాగ్ చేశారు. దీంతో స్పందించిన మెగా హీరో తన పుట్టినరోజు సందర్భంగా ఈ భవనం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకు అభిమానుల సాయం కోరారు.

తన జన్మదిన వేడుకలకు అయ్యే ఖర్చును ఓల్డేజ్ హోం భవనం కోసం వినియోగిద్దామని సూచించారు. దీంతో అభిమానులు భవనం నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం అందించారు. మిగిలిన సొమ్ముతో సాయిధరమ్ తేజ్ వృద్ధాశ్రమానికి శాశ్వత భవనం నిర్మించారు. దీంతో ఆ ఓల్డేజ్ హోం నిర్వాహకులు సాయిధరమ్ తేజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నూతన భవనానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story