- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవ్వుల నవాబు విలన్ వేషాలు… బాలీవుడ్ కోసమేనా?
<p>దిశ, వెబ్ డెస్క్:మెగా బ్రదర్ నాగబాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తెలుగులో బ్లక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ప్రభాస్ చిత్రం ‘ఛత్రపతి’ మూవీని యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో రిమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక విలన్ పాత్ర కోసం నాగబాబు ను సంప్రదించినట్లు తెలుస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నాడు నాగబాబు. ఈ ఫొటోలో నాగబాబు నోటిలో […]</p>

దిశ, వెబ్ డెస్క్:మెగా బ్రదర్ నాగబాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తెలుగులో బ్లక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ప్రభాస్ చిత్రం ‘ఛత్రపతి’ మూవీని యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో రిమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక విలన్ పాత్ర కోసం నాగబాబు ను సంప్రదించినట్లు తెలుస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నాడు నాగబాబు. ఈ ఫొటోలో నాగబాబు నోటిలో సిగరేట్‌తో విలన్ గెటప్ లో దర్శనమిచ్చాడు.ఇక ఈ ఫోటో షూట్ తో బాలీవుడ్ ఆఫర్ నిజమేనని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన రానున్నదట. ఇకపోతే ప్రస్తుతం నాగబాబు ప్రముఖ కామెడీ షో జబర్థస్త్ కార్యక్రమం షోకు దూరమైన తర్వాత ‘ఖుషి ఖుషిగా’ అనే షో కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ నవ్వుల నవాబు బాలీవుడ్ విలనిజాన్ని ఎలా చూపిస్తాడో చూడాలి.






