- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన క్రీడా పాలసీపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ
<p>దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ స్థాయి రాష్ట్ర క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి అవసరమైన క్రీడా పాలసీని రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లిదయాకర్‌రావు, సబితాఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత క్రీడా రంగ స్థితిగతులను మంత్రులు ఆ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే రోల్ మోడల్‌గా ఉండేలా ఉత్తమమైన క్రీడా పాలసీని రూపొందించడానికి వీలుగా ఏ […]</p>

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ స్థాయి రాష్ట్ర క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి అవసరమైన క్రీడా పాలసీని రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లిదయాకర్‌రావు, సబితాఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత క్రీడా రంగ స్థితిగతులను మంత్రులు ఆ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే రోల్ మోడల్‌గా ఉండేలా ఉత్తమమైన క్రీడా పాలసీని రూపొందించడానికి వీలుగా ఏ రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ఉందో అధ్యయనం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. అనేక పథకాల్లో దేశానికే ఆదర్శంగా ఉండేలా విధాన నిర్ణయాలను తీసుకున్న తెలంగాణ ఇప్పుడు క్రీడా పాలసీలో సైతం అదే తరహాలో ఉండాలని మంత్రులు అభిప్రాయపడ్డారు.
క్రీడాశాఖతో పాటు విద్య, పురపాలక, గ్రామీణాభివృద్ది శాఖల ప్రభుత్వ కార్యదర్శులతో త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించి క్రీడా మౌలిక సౌకర్యాలు, క్రీడాకారులకు అందిస్తున్న సౌకర్యాలపై సమగ్ర వివరాలను కేబినెట్ సబ్ కమిటీకి అందించాలని ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులను మంత్రులు ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా మౌలిక సదుపాయాలు, అకాడమీలు,స్పోర్ట్స్ స్కూల్స్, స్టేడియంల పరిస్థితి, కోచ్‌ల వివరాలు, క్రీడాకారుల వివరాలపై మంత్రులు పూర్తి వివరాలను సేకరించారు. మళ్ళీ జరిగే కేబినెట్ సబ్‌కమిటీ సమావేశానికి ప్రముఖ క్రీడాకారులను, కోచ్‌లను ఆహ్వానించి వారి అభిప్రాయాలను, సూచనలను, సలహాలను స్వీకరించాలని క్రీడాశాఖ అధికారులను ఆదేశించారు.






