ఆదివాసీలకు ఆపన్నహస్తం

by  |
ఆదివాసీలకు ఆపన్నహస్తం
X

దిశ, వెబ్‌డెస్క్:

అన్నదానం అంటే ఏదో ఒకరోజు చేస్తారు. కానీ ప్రతిరోజు సొంత డబ్బులతో 250 మందికి భోజనం పెట్టాలంటే కొంచెం ఇబ్బందే. ఆ ఇబ్బందిని కూడా ఇష్టంగా మలుచుకుని గత ఏడాదిన్నర నుంచి కోయంబత్తూరు, తూత్తుకుడికి చెందిన ఎం. బాలచందర్ అన్నదానం చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా, వయస్సు మీద పడటం వల్ల ఇంట్లో కదలలేకుండా ఉన్న ఆదివాసీ వృద్ధులకు రోజూ ఆయన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.

అనైకట్టి కొండల్లో ఉన్న పనప్పల్లి, కొండనూరు, జంబుకంది, కుట్టుపులి, తెక్కలూరు ఆదివాసీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఆయన అన్నం పెడుతున్నారు. గతంలో నగల వ్యాపారం చేసిన బాలచందర్, తనకు 14వ శతాబ్దానికి చెందిన పట్టినాథర్ ఆదర్శమని చెబుతారు. ఆస్తిని వదులుకుని ఆదివాసీలకు అన్నం పెట్టడానికి మునిగా మారిన పట్టినాథర్ కథను అందరికీ చెబుతుంటారు.

ప్రతిరోజు తన స్నేహితుడు మురుగన్‌తో కలిసి 11 నుంచి 12 గంటల మధ్య ఆయా ప్రాంతాలు సందర్శించి 250 ప్యాకెట్ల భోజనం పంచుతారు. ప్రతిరోజు ఈ భోజనాల కోసం ఆయన రూ. 6000 ఖర్చు పెడతారు. అంతేకాకుండా నెలలో ప్రతి మూడో ఆదివారం నాడు పాలమళై తెగ ఉండే ప్రాంతానికి వెళ్లి 5 కేజీల బియ్యం, కేజీ పప్పును 250 కుటుంబాలకు దానం చేస్తారు. 63 ఏళ్ల వయసున్న బాలచందర్‌కి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు కోయంబత్తూరులో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాక విదేశాల్లో స్థిరపడ్డారు. తనకు ఆదివాసీలకు సాయం చేయడంలో సంతృప్తి దొరికిందని బాలచందర్ చెప్పారు.

tags : Coimbatore, Anaikatti, Lunch, Tribals, Tamilnadu, Balachander

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story