‘మీట్ క్యూట్’ ఆంథాలజీలో పాపులర్ యాక్టర్స్

by  |
meet cute
X

దిశ, సినిమా : నేచురల్ స్టార్ నాని ‘వాల్ పోస్టర్’ మరో అమేజింగ్ ప్రాజెక్ట్‌తో ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతోంది. ‘ఆ, హిట్’ వంటి యూనిక్ కాన్సెప్ట్ మూవీస్‌తో సక్సెస్‌ఫుల్‌ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న వాల్ పోస్టర్.. ఈ సారి తెలుగు ఆంథాలజీ ‘మీట్ క్యూట్’ ద్వారా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయం కాబోతుండగా.. సత్యరాజ్, రోహిణి, ఆకాంక్ష సింగ్, ఆదా శర్మ, రుహానీ శర్మ, సునయన, సంచితా పూనాంచ, వర్షా బొల్లామ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.

వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఆంథాలజీకి విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. జూన్‌లో లాంచ్ అయిన ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుండగా.. ఐదు కథల సంకలనంగా రాబోతున్న ఆంథాలజీలో మేల్, ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్‌లో వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు కనిపించబోతుండటం విశేషం.

Next Story

Most Viewed