ప్యారీస్ మాస్టర్స్ విజేత మెద్వెదేవ్

by  |
ప్యారీస్ మాస్టర్స్ విజేత మెద్వెదేవ్
X

దిశ, స్పోర్ట్స్ : రోలెక్స్ ప్యారీస్ మాస్టర్స్ టోర్నీ 2020ను వరల్డ్ నెంబర్ 3 ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ గెలిచాడు. ఆదివారం ప్యారీస్‌లో వరల్డ్ నెంబర్ 4 జ్వెరెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-7, 6-4, 6-1 తేడాతో విజయం సాధించాడు. తొలి సెట్‌లో 5-7తో కోల్పోయిన మెద్వెదేవ్ ఆ తర్వాత పుంజుకున్నాడు. రెండో సెట్‌లో ఒక గేమ్ బ్రేక్ చేసిన మెద్వెదేవ్.. మూడో సెట్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. నిర్ణయాత్మక సెట్‌లో జ్వెరెవ్ కేవలం ఒకే గేమ్ సాధించగా.. మెద్వెదేవ్ 6 గేమ్స్ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో మెద్వెదేవ్ 14 ఏస్‌లు సంధించడమే కాకుండా వరుసగా 7 గేమ్స్ గెలిచాడు. గత 20 ఏళ్లలో ప్యారీస్ మాస్టర్స్‌ను గెలిచిన ఏడో రష్యన్ టెన్నిస్ ప్లేయర్‌గా మెద్వెదేవ్ రికార్డు సృష్టించాడు.

Next Story

Most Viewed