- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ముందు వాళ్లకు చెప్పండి.. ఆ తర్వాత వినియోగించుకోండి'
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: నిజామాబాద్ నగర పాలక సంస్థలో పనిచేస్తున్న సుమారు 950 మంది కార్మికుల ఆరోగ్య సంరక్షణకు అధికార యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. శుక్రవారం నుంచి నగరంలోని ఐదు జోన్లలోని కార్మికులకు పట్టణంలోని ఆరోగ్య కేంద్రాలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని అర్భన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నగర మేయర్ దండు నీతూ కిరణ్ సందర్శించి కార్మికులకు చేస్తున్న వైద్య పరీక్షల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఏమైనా […]</p>

X
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ నగర పాలక సంస్థలో పనిచేస్తున్న సుమారు 950 మంది కార్మికుల ఆరోగ్య సంరక్షణకు అధికార యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. శుక్రవారం నుంచి నగరంలోని ఐదు జోన్లలోని కార్మికులకు పట్టణంలోని ఆరోగ్య కేంద్రాలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని అర్భన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నగర మేయర్ దండు నీతూ కిరణ్ సందర్శించి కార్మికులకు చేస్తున్న వైద్య పరీక్షల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే వైద్య సిబ్బందికి తెలియజేసి ప్రభుత్వం అందిస్తోన్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ జితెశ్ వి పాటిల్, నగర వైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రవి బాబు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Next Story






