హ్యాట్సాఫ్.. మొక్కవోని దీక్షతో వైద్య సిబ్బంది..

by  |
హ్యాట్సాఫ్.. మొక్కవోని దీక్షతో వైద్య సిబ్బంది..
X

దిశ, అర్వపల్లి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. అందులో భాగంగా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు శనివారం మండల పరిధిలోని నాణ్యతండా, పూర్యానాయక్ తండాల్లో పొలం వద్ద గడ్డి కట్టలు కడుతున్న మహిళా రైతుల దగ్గరకు వెళ్లి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు. టీకా ఆవశ్యకత గురించి వివరించి చివరికి టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం విజయశాంతి, ఆశా కార్యకర్తలు జ్యోతి, కర్మిళ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed