మ్యారీడ్ లైఫ్ ప్రాబ్లమ్స్‌పై అక్కినేని కామెంట్స్

415
Akhil

దిశ, సినిమా : అఖిల్ అక్కినేని తన లేటెస్ట్ ఫిల్మ్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రిలీజ్ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాడు. ఈ సందర్భంగా దసరా కానుకగా శుక్రవారం రిలీజ్ కానున్న చిత్ర విశేషాలను పంచుకున్న అఖిల్.. లవ్, మ్యారేజ్ లైఫ్ ప్రాబ్లమ్స్‌ను ఎంటర్‌టైనింగ్‌గా చూపించనున్నట్లు తెలిపాడు. చర్చించిన సమస్యలు తీవ్రమైనవే అయినా, సినిమా చూసిన ప్రేక్షకులు చిరునవ్వుతో ఇంటికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ప్రేమకథకు మించిన ఫీలింగ్ పంచుతుందన్న హీరో.. ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య తలెత్తే సమస్యలనే కాక చాలామంది రియల్ లైఫ్‌లో ఎదుర్కొనే సమస్యలను హైలైట్ చేయడంతో పాటు పరిష్కారాలను చూపిస్తుందని వెల్లడించాడు. ఇక తన కుటుంబానికున్న లవర్ బాయ్ ఇమేజ్ వారసత్వాన్ని బ్రేక్ చేసేందుకు ట్రై చేస్తున్నట్టు స్పష్టం చేశాడు. ఫ్యూచర్‌లో కొన్నేళ్లు లవ్ స్టోరీలకు దూరంగా ఉంటానన్న అఖిల్.. మూస ధోరణితో వెళ్లడం ఇష్టం లేదని తెలిపాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..