జన్యు సంబంధిత వ్యాధుల గుర్తింపునకు కొత్త కోర్సు

by  |
జన్యు సంబంధిత వ్యాధుల గుర్తింపునకు కొత్త కోర్సు
X

దిశ, తెలంగాణ బ్యూరో : జాతీయ వైద్య మండలి వైద్య విద్యలో ‘ఎండీ మెడికల్ జెనటిక్స్’ అనే కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. జన్యుసంబంధిత వ్యాధులు గుర్తింపు, చికిత్సలు చేపట్టేందుకు ఈ కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సుకు సంబంధించిన వివరాలను జాతీయ వైద్యమండలి తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. కోర్స్ కాల వ్యవధి మూడేండ్లుగా నిర్ణయించారు. జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, పిడియాట్రిక్స్ పూర్తి చేసిన వారు అర్హులుగా ప్రకటించారు. ఈ కోర్సులో సీట్లను భర్తీ చేసేందుకు జాతీయ స్థాయిలో ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు.

దేశంలోని కొన్ని ప్రతిష్టాత్మక వైద్య కళాశాలల్లోనే వచ్చే ఏడాది ఈ కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. తర్వాత అన్ని మెడికల్ కళాశాలల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం జన్యసంబంధిత వ్యాధులను గుర్తించేందుకు జెనెటిక్ సైంటిస్టులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ వ్యాధులకు ప్రత్యేకమైన చికిత్సలు సైతం లేకపోవడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నింటిని అధిగమించేందుకు మెడికల్ జెనటిక్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్టుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed