22 కిలోలు తగ్గిన మోహన్‌లాల్ డాటర్.. ఎలా?

by  |
22 కిలోలు తగ్గిన మోహన్‌లాల్ డాటర్.. ఎలా?
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళీ మెగాస్టార్ మోహన్ లాల్ కూతురు ‘విస్మయ మోహన్‌ లాల్’ ఫిట్‌నెస్ జర్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తండ్రిలాగే తన ఫాలోవర్స్‌కు ఫిట్‌నెస్ గోల్స్ ఇచ్చిన విస్మయ.. థాయ్‌లాండ్‌లోని కోహ్ సాముయి ఐలాండ్ క్యాంప్‌లో ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియో షేర్ చేసింది. 22 కిలోలు తగ్గిన తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి వివరించింది.

చాలా ఏళ్లుగా బరువు తగ్గాలని.. ఫిట్ బాడీ గెయిన్ చేయాలని అనుకుంటున్నా ఆ వైపుగా ఎలాంటి ప్రయత్నం చేయలేదని తెలిపింది విస్మయ. కానీ థాయ్‌లాండ్‌కు వచ్చాక ‘ముయే థాయ్‌’ను మొదటిసారి ప్రయత్నించడం నుంచి కొండలను అధిరోహించడం, సూర్యాస్తమయంలో స్విమ్మింగ్ వరకు అన్నీ ఎంజాయ్ చేశానని చెప్పింది. తను డల్ అయిన ప్రతీసారి ట్రైనర్ ఎంకరేజ్ చేసేవాడని తెలిపిన విస్మయ.. ఈ జర్నీ జస్ట్ వెయిట్ లాస్ మాత్రమే కాదు.. తన మీద తనకు నమ్మకం పెంచేలా చేసిందని, కొత్తగా ప్రయత్నించాలని చెప్పిందన్నారు. ఇది నిజంగా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అని సంతోషం వ్యక్తం చేసిన విస్మయ.. అప్పటి, ఇప్పటి ఫొటోలను షేర్ చేసింది. ఈ ప్రయాణంలో అద్భుతమైన వ్యక్తులను కలిసినట్లు వివరించింది.


Next Story

Most Viewed