- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదివాసీలను తరిమేసేందుకే కొత్త చట్టాలు : జగన్
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం : కొత్త అటవీ చట్టం పేరుతో అడవుల నుంచి ఆదివాసీలను దూరం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖలో పేర్కొన్నారు. ఆయన పేరిట బుధవారం విడుదలైన లేఖలో అనేక విషయాలను ప్రస్తావించారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలతో రైతాంగాన్ని భూమి నుంచి దూరం చేస్తోందని పేర్కొన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పలు పౌర, ప్రజాస్వామిక హక్కుల నేతలను మావోయిస్టుల పేరుతో అరెస్ట్ చేసి నిర్బంధిస్తున్నారని లేఖలో తెలిపారు. […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం : కొత్త అటవీ చట్టం పేరుతో అడవుల నుంచి ఆదివాసీలను దూరం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖలో పేర్కొన్నారు. ఆయన పేరిట బుధవారం విడుదలైన లేఖలో అనేక విషయాలను ప్రస్తావించారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలతో రైతాంగాన్ని భూమి నుంచి దూరం చేస్తోందని పేర్కొన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పలు పౌర, ప్రజాస్వామిక హక్కుల నేతలను మావోయిస్టుల పేరుతో అరెస్ట్ చేసి నిర్బంధిస్తున్నారని లేఖలో తెలిపారు.
పాలక వర్గ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే బూటకపు ఎన్ కౌంటర్లు, ఎదురుకాల్పులతో హత్య చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళల హక్కుల కోసం, వారిపై జరుగుతున్న లైంగికదాడులకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగిందని, మరింత ఉత్సాహంతో పురోగమించారని లేఖలో పేర్కొన్నారు.
Next Story






