‘మాస్టర్’ ఖాతాలో మోస్ట్ లైక్స్ రికార్డు

by  |
‘మాస్టర్’ ఖాతాలో మోస్ట్ లైక్స్ రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ సూపర్ స్టార్ విజయ్ క్రేజ్ మామూలుగా ఉండదు. తెలుగులో ఇప్పుడిప్పుడే మార్కెట్‌ను పెంచుకుంటున్న ఈ హీరో.. తాజాగా ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ఖైదీ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజ్ ‘మాస్టర్’ సినిమాను రూపొందిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా, సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. సినిమా విడుదల కాకముందే ఈ చిత్రం ఓ రికార్డును క్రియేట్ చేసింది.

లాక్‌డౌన్ లేకపోయి ఉంటే.. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసేదని అభిమానులు అభిప్రాయపడగా, వాళ్లు ఆశించినట్లుగానే విడుదలకు ముందే మాస్టర్ ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్ర ట్రైలర్‌ను దీపావళి రోజు విడుదల చేయగా, 24 గంటలు దాటక ముందే ఈ టీజర్‌ 16 మిలియన్‌ వ్యూస్‌తో పాటు 1.7 మిలియన్‌ లైక్స్‌తో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ను క్రియేట్‌ చేసింది. మోస్ట్ లైక్స్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచిందని ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

సూపర్ స్టైలిష్ కాలేజ్ పొలిటికల్ డ్రామాగా మాస్టర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఇందులో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండటం విశేషం. టీజర్ అంతా కాలేజ్ నేపథ్యంలోనే సాగింది. రౌడీ పాత్రలో విజయ్ సేతుపతి, ప్రొఫెసర్‌గా విజయ్ నటిస్తున్నారు. మాళవిక మోహనన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుధ్ అందించిన సంగీతం ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్ల ఓపెన్ చేయడం ఆలస్యం కావడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే విజయ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాను ‘థియేటర్‌లో మాత్రమే రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావించింది. దాంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.



Next Story

Most Viewed