‘మాస్టర్’ టీజర్ లోడింగ్..

by  |
‘మాస్టర్’ టీజర్ లోడింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమా గురించి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. టీజర్ రిలీజ్ అవుతుందన్న వార్తతోనే ‘మాస్టర్’ ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలవగా.. దీనిపై అఫిషియల్ అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. విజయ్‌తో కలిసి మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఈ సినిమా ఆడియన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ఇప్పటికే రెడీ కాగా.. దీపావళి కానుకగా నవంబర్ 14న సాయంత్రం ఆరు గంటలకు సన్ టీవీ యూట్యూబ్ చానల్‌లో టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించగా.. అప్‌డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కేక అంతే అంటున్నారు ఫ్యాన్స్. ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయ్ రాక్ స్టార్ అంటున్న విజయ్ ఫ్యాన్స్.. మాస్టర్ టీజర్ కోసం సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.

Next Story

Most Viewed