ఆ పనులతో నిర్మాతల దగ్గర డబ్బులు లాగుతున్న తమన్నా..

by  |
tamanna news
X

దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు మాస్టర్ చెఫ్‌ హోస్ట్‌గా బుల్లితెర కెరియర్ ప్రారంభించింది. జెమిని టీవీలో ప్రసారమవుతున్న ఈ షోకు సరైన రేటింగ్ కరువైంది. తమన్నా హోస్టింగ్ సరిగ్గాలేకనే ఇలా జరుగుతుందనే అభిప్రాయంతో నిర్వాహకులు.. అనసూయ భరద్వాజ్‌తో షో కొనసాగిస్తున్నారు. అయితే ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ-తమన్నాకు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఈ షో కోసం రూ. 2 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ. 1.56 కోట్లు చెల్లించారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది.

అయితే ఇందులో తమ తప్పు లేదని వివరణ ఇచ్చింది ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ. జూన్ 24 – సెప్టెంబర్ వరకు ఈ ప్రోగ్రామ్ కోసం 18 రోజులు షూటింగ్ చేయాల్సి ఉందని తెలిపింది. అయితే తను కేవలం 16 రోజులు మాత్రమే అటెండ్ అయిందని.. మిగిలిన రెండు రోజుల్లో తను హాజరుకాకపోయే సరికి రూ. 5 కోట్లు నష్టపోయామని వివరణ ఇచ్చింది. తమన్నాకు ఫిక్స్ చేసిన షూటింగ్ డేట్ రోజునే మిగతా 300 మంది ‘కాస్ట్ అండ్ క్రూ’కు కూడా చిత్రీకరణ ఉంటుందని.. వారందరూ హాజరైనా తమన్నా మాత్రం రాకపోయేసరికి ఈ విధంగా జరిగిందని తెలిపారు. పైగా తను సెకండ్ సీజన్ డబ్బుల కోసం డిమాండ్ చేయడం ఇంకా ఆశ్చర్యం అనిపించిందని చెప్పారు.

Next Story

Most Viewed