తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన దుకాణాలు

61

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ఆస్థాన మండపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్‌తో మంటలు చెలరేగి పలు దుకాణాలు, సామాగ్రి కాలిబూడిదయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఫైర్ సిబ్బంది సహాయంలో మంటలు ఆర్పుతున్నారు. కాగా, ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..