హైదరాబాద్: మంగళహాట్‌లో భారీ అగ్నిప్రమాదం

175
huge fire accident in Kolkata

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మంగళహాట్‌లో భారీ అగ్ని్ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఫ్లైవుడ్ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ప్రకాష్ థియేటర్‌లోకి పాకి భారీగా ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజన్‌లతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విద్యుత్ షార్ట్‌సర్క్యూటే కారణం కావచ్చని భావిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే గాని ఆస్తినష్టాన్ని అంచనా వేయలేమని పోలీసులు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..