- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదనపు కట్నం కోసం చిత్రహింసలు..
<p>దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు కోడలును ఇంట్లో నిర్భంధించి చిత్రహింసలకు గురిచేశారు. దీంతో బాధితురాలు ఎలాగోలా తప్పించుకుని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. విజయవాడకు చెందిన విజయ్ భాస్కర్ తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని నమ్మించి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతకముందే అతను వేరే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించినట్లు […]</p>

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు కోడలును ఇంట్లో నిర్భంధించి చిత్రహింసలకు గురిచేశారు. దీంతో బాధితురాలు ఎలాగోలా తప్పించుకుని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకివెళితే.. విజయవాడకు చెందిన విజయ్ భాస్కర్ తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని నమ్మించి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతకముందే అతను వేరే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించినట్లు సమాచారం. కాగా, విహహం జరిగిన సరిగ్గా ఏడాది తర్వాత వివాహితను అదనపు కట్నం కోసం భర్త వేధించసాగాడు.
అతనికి తోడు అత్త, ఆడపడుచులు, బావ కూడా ఆమెను ఇంట్లోనే నిర్భంధించి చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు మీడియాతో తన గోడును వెల్లబోసుకుంది. గత నాలుగు రోజులుగా కనీసం తిండి, మంచినీళ్లు ఇవ్వకుండా టార్చర్ చేశారని వాపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






