- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, ఎల్బీనగర్ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్ లోని శారదానగర్‌లో నివాసముండే బాలచందర్, ఉదయశ్రీ (23) లు దంపతులు. వీరికి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. తొమ్మిది నెలల బాబు ఉన్నాడు. బాలచందర్ ముత్తూట్ ఫైనాన్స్ లో మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. కాగా శనివారం ఉదయశ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త, భర్త […]</p>

X
దిశ, ఎల్బీనగర్ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్ లోని శారదానగర్‌లో నివాసముండే బాలచందర్, ఉదయశ్రీ (23) లు దంపతులు. వీరికి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. తొమ్మిది నెలల బాబు ఉన్నాడు. బాలచందర్ ముత్తూట్ ఫైనాన్స్ లో మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.
కాగా శనివారం ఉదయశ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త, భర్త తరుపు బంధువులు కుట్రపూరితంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఉదయశ్రీ బంధువులు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






