- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కతో మ్యారేజ్.. చెల్లితో ఎఫైర్.. ఇద్దరు కలిసి ఇంట్లో ఏం చేశారంటే…?
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సమాజంలో వివాహేతర సంబంధాల సమస్య ఎక్కువైపోతోంది. ఈ సంబంధాల వలన అనేక కాపురాలు చెల్లాచెదురవుతున్నాయి. కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఒక వివాహేతర సంబంధం వల్ల ఒక జంట బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్ లోని మొరాబాదాబాద్ జిల్లా ధర్కానగ్లా గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కి ఒక యువతితో రెండేళ్ల క్రితం వివాహమయ్యింది. పెళ్లి తర్వాత అత్తగారింటికి వెళ్ళినప్పుడు భార్య చెల్లి […]</p>

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సమాజంలో వివాహేతర సంబంధాల సమస్య ఎక్కువైపోతోంది. ఈ సంబంధాల వలన అనేక కాపురాలు చెల్లాచెదురవుతున్నాయి. కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఒక వివాహేతర సంబంధం వల్ల ఒక జంట బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్ లోని మొరాబాదాబాద్ జిల్లా ధర్కానగ్లా గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కి ఒక యువతితో రెండేళ్ల క్రితం వివాహమయ్యింది. పెళ్లి తర్వాత అత్తగారింటికి వెళ్ళినప్పుడు భార్య చెల్లి కాస్త చనువుగా మాట్లాడడంతో ఇతను కూడా బావ అని అలాగే ప్రవర్తించాడు. ఈ చనువు కాస్తా కొద్దీ రోజులకే వివాహేతర సంబంధానికి దారి తీసింది.
భార్య కన్నా మరదలే కావాలని నిర్ణయించుకున్నాడు రాజ్ కుమార్. ఇంట్లో తెలిస్తే పెద్ద వాళ్లు ఒప్పుకోరని ఎవరికి తెలియకుండా ఇంటి నుండి పారిపోయారు. ఈ నేపథ్యంలోనే తన కూతురికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని అత్తమామలు, అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి బావ, మరదలు కలిసి బతకలేమని అనుకోని ఇద్దరు పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫోన్ సిగ్నల్స్ ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






