- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ మండల పార్టీ సొంత ఊరిలో ఉత్కంఠకు తెర.. అతడే ఏకగ్రీవం
by Shyam |
<p>దిశ, అనంతగిరి: టీఆర్ఎస్ మండల పార్టీ సొంత ఊరిలో ఉత్కంఠకు తెరపడింది. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఖానాపురం టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్ష పదవి పీఠం కొలిక్కి వచ్చింది. గ్రామ శాఖ అధ్యక్షునిగా మర్రి సంతోష్ ను ఏకగ్రీవంగా నియమించారు. బుధవారం కోదాడ పట్టణ క్యాంపు కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ఖానాపురం గ్రామంలో […]</p>

X
దిశ, అనంతగిరి: టీఆర్ఎస్ మండల పార్టీ సొంత ఊరిలో ఉత్కంఠకు తెరపడింది. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఖానాపురం టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్ష పదవి పీఠం కొలిక్కి వచ్చింది. గ్రామ శాఖ అధ్యక్షునిగా మర్రి సంతోష్ ను ఏకగ్రీవంగా నియమించారు. బుధవారం కోదాడ పట్టణ క్యాంపు కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ఖానాపురం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామంలోని కార్యకర్తలను సమన్వయ పరుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తాను అని పేర్కొన్నారు. గ్రామ శాఖ అధ్యక్షునిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు, మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
Next Story






