‘నాది నక్కిలీసు గొలుసు’ లాంటి మరో ఐటెం సాంగ్

by  |
‘నాది నక్కిలీసు గొలుసు’ లాంటి మరో ఐటెం సాంగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పలాస’ చిత్రంలోని ‘నాది నక్కిలీసు గొలుసు’ పాట అందరికీ గుర్తుండే అంటుంది. ఆ పాటకు ఢీ ప్రొగ్రాంలో డ్యాన్స్ చేసి, ‘టిక్ టాక్ దుర్గారావు’ ట్రెండీ స్టెప్స్ వేసి యూ ట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ పొందాడు పండు. కాగా, ‘నల్లాని కాటుక పెట్టి..నడుముకు గొలుసు కట్టి’ అనే మరో ఐటెం సాంగ్‌కు కొరియోగ్రఫీ చేశాడు పండు. మెగా బ్రదర్‌ నాగబాబు చేతుల మీదుగా ‘మరో ప్రేమకథ’ చిత్రంలోని ఈ ఐటెం సాంగ్‌ని చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. శ్రావణ్ వైజిటి, షీతల్ భట్ జంటగా కె.బిక్షపతి దర్శకత్వంలో రుద్రక్రాంతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకటేశం నిర్మిస్తున్న లవ్ ఎంటర్‌టైనర్ ‘మరో ప్రేమకథ’.

మెగా బ్రదర్ నాగబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ పండు డెబ్యూ ఫిలిం ‘మరో ప్రేమకథ’ని, సాంగ్‌లో డ్యాన్స్ మూమెంట్స్ బాగున్నాయని, ఈ సాంగ్‌తో పాటు మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. పండు తనకు చాలా ఇష్టమైన వ్యక్తని చెప్పారు. హీరోగా పరిచయమవుతున్న శ్రవణ్ సక్సెస్ అయితారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘నల్లని కాటుక’ ఐటెం సాంగ్‌ను కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌ చెప్పారు పండు. ఈ సాంగ్‌లో ‘టిక్ టాక్ దుర్గారావు’ ‘అదిరింది రియాజ్’ కనిపిస్తారు. కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌, ఐటం గర్ల్‌గా చేసిన నమ్రత మల్ల, హీరో శ్రవణ్‌, దర్శకుడు బిక్షపతి, నిర్మాత వెంకటేశం పాల్గొన్నారు. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను విడుదల చేస్తామని తెలిపారు.

Next Story